Header Banner

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

  Sat May 24, 2025 14:40        Politics

కోయంబత్తూరు సమీపం మేట్టుపాళయం - ఊటీ రహదారిలో కల్లార్‌ ఫ్లైఓవర్‌ వద్ద సంభవించిన కారు ప్రమాదంలో అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌ మనవరాలు మృతి చెందగా మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మదురైలో నివసిస్తున్న శ్రీనివాసన్‌ మనవరాలు దివ్య ప్రియ (28) మదురైలో డెంటల్‌ క్లినిక్‌ నడుపుతున్నారు. ఆమె భర్త కార్తీక్‌రాజా, బంధువులు వలర్మతి (48), పరమేశ్వరి (44) సహా బంధువులతో ఊటీకి ఈ నెల 20న కారులో విహారయాత్రకు బయలుదేరారు.

 

ఇది కూడా చదవండి: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

ఊటీ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అందరూ గురువారం సాయంత్రం మదురై బయలుదేరారు. మదురైకి చెందిన పార్తీబన్‌ నడుపుతున్న కారు మేట్టు పాళయం - కున్నూరు ఘాట్‌రోడ్డు కల్లారు సమీంపంలోని మలుపువద్ద బ్రేకులు పనిచేయకపోవడంతో అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. అదుపుతప్పిన ఆ కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దివ్యప్రియా, పరమేశ్వరి, వలర్మతిని స్థానికుల సహాయంతో కార్తీక్‌రాజా, డ్రైవర్‌ పార్తీబన్‌ కారు శిథిలాల మధ్య నుండి వెలికి తీసి ఆంబులెన్స్‌ను రప్పించి చికిత్స కోసం మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి దివ్యప్రియా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మేట్టుపాళయం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem